అ.ఫి.సొ. సభ్యులుగా చేరండి-చేర్పించండి! కళాత్మక,సందేశాత్మక అవార్డ్ చిత్రాలను తిలకించండి!!

afiso info

అనకాపల్లి ఫిలిం సొసైటీ గురించి:
రొటీన్ చిత్రాలతో విసుగెత్తి పోయిన ప్రజలకు ఒక ఒయాసిస్ లాంటిది అనకాపల్లి ఫిలిం సొసైటీ. అత్యుత్తమ విలువలు కలిగిన జాతీయ, అంతర్జాతీయ చిత్రాలను ప్రేక్షకులకు అందించేందుకు శ్రాయశాక్తులా ప్రయత్నిస్తున్న సేవా సంస్థ ఇది. ఉత్తమ విలువలు కలిగిన చిత్రాలను ఆస్వాదించండి.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అద్భుతమైన చిత్రాలను చూసేందుకు ఒక వేదికగా అనకాపల్లి ఫిలిం సొసైటీ పనిచేస్తోంది. అనకాపల్లి పట్టణంలో 1978 లో ప్రారంభమైన ఈ సొసైటీ పలు అంతర్జాతీయ, జాతీయ, అవార్డు చిత్రాలను ప్రదర్శించి అందరి మన్ననలూ పొందుతోంది. శ్రీ తమ్మన సుబ్బారావు, పి. ఎస్. అజేయ్ కుమార్లు ఈ సంస్థకు అధ్యక్షకార్యదర్శులుగా పని చేస్తున్నారు.

పెరుగుతున్న ఆదరణ:
అనకాపల్లి ఫిలిం సొసైటీకి నానాటికీ ప్రజాదరణ పెరుగుతోంది. ఇది ఛాలా సంతోషించదగిన పరిణామం. పరిణితి కలిగిన ప్రజలు అనకాపల్లి ఫిలిం సొసైటీ లో సభ్యులుగా చేరేందుకు పోటీ పడటం ముదావహం. అనకాపల్లి పట్టణం లోనే కాకుండా సమీప పట్టణాల్లోని మేధావులు, రచయితలూ, ఉపాధ్యాయులూ, వ్యాపారులూ, వివిధ వర్గాల ప్రజలూ అనకాపల్లి ఫిలిం సొసైటీ లో సభ్యులుగా చేరారు. అనకాపల్లి ఫిలిం సొసైటీ ని ఆదరించండి.



Anakapalli Film Society is a wonderful forum for the people who are disgusted with the Routine Formula Films. It puts its tireless efforts to screen wonderful national and international films. 
It's a wonderful thing that Anakapalli Film Society gains popularity and membership day-by-day. The people with high values, thinking are the members of the society. 
 Anakapalli Film Society is the right place for the people who wish to enhance their creative and cultural talents by watching unlimited, wonderful, creative films belong to different parts of the world.
      It was established in Anakapalli, a small town in Visakhapatnam District in 1978. Several National and international films were screened for its members.
      Sri Tammana Subba Rao and Sri P.S.Ajey Kumar looking after the the resposibilities of the society as President and General Secretaries.






అ.ఫి.సొ. ముఖ్య అతిథిగా ప్రసంగిస్తున్న ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. 
వేదికపై ఎడమనుండి కుడికి : అధ్యక్షులు కె.కె. ప్రసాదరావు, కార్యదర్శి తమ్మన సుబ్బా రావు . 

ఇండియన్ పనోరమ చిత్ర ప్రదర్శన ప్రారంభకులు M.L.A. శ్రీ దాడి వీరభద్ర రావు. ఎడమనుండి కుడికి :తమ్మన సుబ్బారావు,సహాయ కార్యదర్శి వెంపరాల నరసింహ మూర్తి,ఉపాధ్యక్షులు ఎస్.కమలాకరరావు 

ఇండియన్  పనోరమ చిత్ర ప్రదర్శన సందర్భంగా ఉపన్యసిస్తున్న
  శ్రీ దాడి వీరభద్ర రావు.ఎడమనుండి కుడికి :
 అనకాపల్లి మాజీ మున్సిపల్  చైర్మన్ మళ్ళ సాంబశివరావు ,
 ఎస్.కమలాకరరావు, తమ్మన సుబ్బారావు